తానా ఆధ్వర్యంలో బ్యాగుల వితరణ
తానా ఆధ్వర్యంలో బ్యాగుల వితరణ

ఇంటర్నెట్ ‌డెస్క్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హైస్కూలు విద్యార్థులకు స్కూలు బ్యాగులు అందజేశారు. అమెరికా పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థుల కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఏటా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభించాక అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో తానా ఆధ్వర్యంలో స్కూలు బ్యాగులు పంపిణీ చేస్తారు. రెండు దశాబ్దాల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం (ఆగస్టు 20) డౌనింగ్‌ టౌన్‌లోని లార్డ్స్ పాంట్రీకు వంద స్కూలు బ్యాగులు, ఇతర స్కూలు వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా కార్యదర్శి పొట్లూరి రవి, మిడ్ అట్లాంటిక్ సహాయక కమిటీ చైర్ గోపి వాగ్వాల పాల్గొన్నారు. అపర్ణ వాగ్వాల ఆధ్వర్యంలోని హెచ్‌టూసీ (హెల్ప్ కేర్ కంఫర్ట్) సంస్థ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందజేసింది. కొవిడ్‌-19 ప్రభావంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఫిలడెల్ఫియా ప్రాంతంలోని మూడు స్కూలు పాంట్రీలకు సహాయం చేసినట్లు, ఫుడ్ బ్యాంకులకి ప్రతి నెలా ఆహార పదార్థాలు అందిస్తున్నట్లు తానా ఓ ప్రకటనలో తెలిపింది. తానా ఫిలడెల్ఫియా యువ విభాగం వాలంటీర్లు, ఇతర దాతలు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా విరాళాలు అందిస్తున్నారని, వారి సేవలు మరువలేనివని తానా అధ్యక్షుడు జై తాళ్లూరి కొనియాడారు.


మరిన్ని