వచ్చే ఏడాది శ్వేతసౌధంలో.. ఐస్‌క్రీములతో..
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వచ్చే ఏడాది శ్వేతసౌధంలో.. ఐస్‌క్రీములతో..

కమలా హారిస్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ స్థానిక కాలమానం ప్రకారం అక్టోబర్‌ 20న తన 56వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే పుట్టిన రోజును వైట్‌ హౌస్‌లో జరుపుకుందామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

‘‘హ్యాపీ బర్త్‌డే కమలా హారిస్‌. వచ్చే సంవత్సరం మీ జన్మదినాన్ని మనం వైట్‌హౌస్‌లో ఐస్‌క్రీమ్‌తో వేడుకగా జరుపుకుందాం’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించిన ఆయన.. హారిస్‌కు శుభాకాంక్షలు తెలిజేస్తూ ఒక చిత్రాన్ని కూడా జతచేశారు.
దీనికి స్పందించిన కమలా హారిస్‌ ఆయనకు కృతజ్ఞత తెలిపారు. తన జన్మదిన కానుకగా.. రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు వేయాలని ఆమె అమెరికా పౌరులను కోరారు. ఆమె సోదరి కుమార్తె, ప్రముఖ న్యాయవాది మీనా హారిస్‌ జన్మదినం కూడా నేడే కావటం విశేషం. కాగా, కమలా హారిస్‌కు మాజీ ప్రథమ మహిళ హల్లరీ క్లింటన్‌తో సహా పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.


మరిన్ని