బైడెన్‌ ముందంజ!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బైడెన్‌ ముందంజ!

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అమెరికా మీడియా అంచనాల ప్రకారం, ఇప్పటివరకు వెళ్లడైన ఫలితాల్లో మెజారిటీ స్థానాల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు బైడెన్‌కు 238 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా అధ్యక్షుడు ట్రంప్‌నకు 213 ఎలక్టోరల్‌ ఓట్లు పోలయ్యాయి. స్వింగ్‌ స్టేట్స్‌గా పిలిచే కీలక రాష్ట్రాల్లో పోరు హోరాహోరీగా సాగుతోంది.

అమెరికా రాజధాని డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా(డీసీ)తోపాటు అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లున్న కాలిఫోర్నియా(55) మొత్తం జో బైడెన్‌ స్వీప్‌చేశారు. వీటితోపాటు న్యూయార్క్‌(29), ఇల్లినోయిస్‌(20), న్యూజెర్సీ(14), వర్జీనియా(13), వాషింగ్టన్‌(12)తోపాటు చాలా కీలక రాష్ట్రాల్లో బైడెన్‌ ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్లను సాధించారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు టెక్సాస్‌లో అత్యధికంగా 38 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా ఫ్లోరిడాలో 29 ఓట్లు సాధించారు. ఇక ఇండియానా(10), టెన్నిస్సీ(10), ముస్సోరీ(10)లో పదికిపైగా ఓట్లు వచ్చాయి.

బైడెన్‌ ఇప్పటివరకు 49.9శాతం పాపులర్‌ ఓట్లు సాధించగా ట్రంప్‌నకు 48.5శాతం పాపులర్‌ ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. బైడెన్‌కు 6కోట్ల 76లక్షల ఓట్లు రాగా ట్రంప్‌నకు 6కోట్ల 57లక్షల ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 451 ఎలక్టోరల్‌ ఓట్ల ఫలితం తేలగా ఇంకా 87 ఎలక్టోరల్‌ ఓట్ల ఫలితం వెల్లడికావాల్సి ఉంది.

ఇవీ చదవండి..
ఇది గెలిస్తేనే ట్రంప్‌లకు ఫ్యూచర్‌..!
సొంత రాష్ట్రంలో ఓటమి దిశగా బైడెన్‌..!


మరిన్ని