అమెరికా ఎన్నికలు.. ఇప్పటివరకు హైలైట్స్‌!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికా ఎన్నికలు.. ఇప్పటివరకు హైలైట్స్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సెనారో మరోసారి స్పష్టంచేశారు. ట్రంప్‌ ఓటమిపాలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఆయన‌ విజయంపై తనకు నమ్మకం ఉందని ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూలో బోల్సెనారో వెల్లడించారు.

ఇప్పటివరకు ఉన్న మరి కొన్ని హైలైట్స్‌..
*అగ్రరాజ్యంలో ఎన్నికల వేళ ఓట్ల అవకతవకలపై వస్తోన్న ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. విదేశీ శక్తుల చేతిలో అమెరికా ఓట్లు అవకతవకలు గురయ్యాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ స్పష్టంచేసింది.
*దేశవ్యాప్తంగా ఇప్పటికే ముందస్తు పోలింగ్‌లో దాదాపు 10కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అధ్యక్షుడు ఎవరనేది తేల్చేందుకు అమెరికన్లు భారీ సంఖ్యలో పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కట్టారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం ఐదు గంటల నుంచే ఓటర్లు క్యూలైన్లో నిలబడ్డారు.
కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా పోలింగ్‌ స్టేషన్ల వద్ద భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు.
*పోలింగ్‌ జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు ట్రంప్‌ వాషింగ్టన్‌లోనే ఉన్నారు. కాగా డెమొక్రాటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ పోలింగ్‌ రోజు ఉదయం ఆయన సతీమణి జిల్‌తో కలిసి చర్చిని సందర్శించారు. పోలింగ్‌ రోజు మొత్తం పెన్సిల్వేనియా, డెలవేర్‌
లోనే ఉండే అవకాశం ఉంది. 
*జో బైడెన్‌ ముందంజలో ఉన్నారని ప్రీ పోల్స్‌ అంచనా వేసినప్పటికీ, ఇద్దరి అభ్యర్థుల మధ్య స్వల్ప తేడానే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, విస్కాన్‌సిన్‌, మిషిగాన్‌, ఆరిజోనా వంటి కీలక రాష్ట్రాల్లో ఇద్దరిమధ్య హోరాహోరి పోరు ఉండనుందని అంచనా.
*ఈ ఎన్నికల్లో తనకు 306 ఎలక్టోరల్‌ ఓట్లు వస్తాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తంచేశారు. గత ఎన్నికల్లో ట్రంప్‌ 304 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. ఇక కమలా హారిస్‌ గెలిస్తే అమెరికా ప్రజలతోపాటు మహిళలకు పరిస్థితులు భయంకరంగా ఉంటాయని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.
*కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడి సతీమణి మిషెల్లీ ఒబామా మద్దతు తెలిపారు. అంతేకాకుండా ఒటర్లు ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని ఆమె పిలుపునిచ్చారు.


మరిన్ని