అమెరికా వీసాలకు బ్రేక్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికా వీసాలకు బ్రేక్‌

మే 3 నుంచి ఇంటర్వ్యూల రద్దు
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా తీవ్రత నేపథ్యంలో అమెరికా వీసా ప్రక్రియలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ మంగళవారం ప్రకటించింది. నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాల కోసం వచ్చే నెల మూడో తేదీ నుంచి జరగాల్సిన అన్ని ఇంటర్వ్యూలు, డ్రాప్‌బాక్స్‌ ప్రక్రియలను నిలిపివేసింది. వీసా ప్రక్రియను తిరిగి ఎప్పుడు ఆరంభించేది తరవాత ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా సిటిజన్‌ సర్వీసులకు సంబంధించిన ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను మంగళవారం నుంచే నిలిపివేసినట్లు వెల్లడించింది. అమెరికా పౌరుల అత్యవసర సేవలు, వీసా అపాయింట్‌మెంట్లను స్థానిక పరిస్థితులు అనుకూలించిన మేరకు అనుమతిస్తామంది. అత్యవసరాలపై ఇప్పటికే తీసుకున్న ఇంటర్వ్యూ తేదీలను యథావిధిగా సాధ్యమైనంత మేరకు అనుమతిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు సేవలందిస్తుంది.


మరిన్ని