మాపై మరోసారి విశ్వాసం ఉంచండి: జో బైడెన్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మాపై మరోసారి విశ్వాసం ఉంచండి: జో బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అటు ట్రంప్‌, ప్రత్యర్థి జోబైడెన్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా డెమొక్రాటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ ఓటర్లకు మరోసారి విజ్ఞప్తిచేశారు. ‘బరాక్‌ ఒబామా నేతృత్వంలో 2008, 2012 ఎన్నికల్లో దేశాన్ని ముందుండి నడిపించడంలో మీరు నాపై నమ్మకం ఉంచారు. ప్రస్తుతం నేను, కమలా హారిస్‌ కలిసి పోటీచేస్తున్నందున.. మాపై మరోసారి నమ్మకాన్ని ఉంచాలని విజ్ఞప్తిచేస్తున్నా. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించడంతోపాటు ప్రజల మన్ననలను చూరగొంటాం. మిమ్మల్ని నిరాశ పరచమని హామీ ఇస్తున్నా’ అని అమెరికన్లకు ట్విటర్‌లో విజ్ఞప్తిచేశారు.

అమెరికా కాలమానం ప్రకారం, ఉదయం 6గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ రాత్రి 9గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌లో ఇప్పటికే దాదాపు 10కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోగా, నేడు మరో 6కోట్ల మంది ఓటు వేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటర్లు భారీ సంఖ్యలో క్యూలైన్లలో వేచిఉండే పరిస్థితి ఉండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.


మరిన్ని