అమెరికా అవార్డుకు ఎంపికైన భారత మహిళ
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికా అవార్డుకు ఎంపికైన భారత మహిళ

న్యూయార్క్‌: అమెరికా అందించే అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్‌ అవార్డుకు ప్రముఖ భారత సామాజికవేత్త అంజలి భరద్వాజ్‌ ఎంపికయ్యారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసం అంజలి చేస్తున్న కృషికి గానూ ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అంతర్జాతీయంగా అవినీతిపై పోరాడుతున్న వారిని గౌరవించేందుకు జో బైడెన్‌ ప్రభుత్వం అవినీతి నిరోధక ఛాంపియన్‌ అవార్డును తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వివిధ దేశాల్లో అవినీతి అంతానికి విశేష కృషి చేస్తున్న 12 మందిని ఎంపిక చేయగా అందులో అంజలి భరద్వాజ్‌ కూడా ఉన్నారు.

48 ఏళ్ల అంజలి రెండు దశాబ్దాల కాలంగా దేశంలో సమాచార హక్కు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. సత్కార్‌ నాగరిక్‌ సంఘటన్‌ (ఎస్‌ఎన్‌ఎస్‌)ను స్థాపించిన అంజలి.. దాని ద్వారా ప్రభుత్వాల్లో పారదర్శకత, జవాబుదారీ తనాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అవినీతి నిరోధక ఛాంపియన్‌ అవార్డుకు తనను ఎంపిక చేయడం పట్ల అంజలి భరద్వాజ్‌ సంతోషం వ్యక్తం చేశారు.మరిన్ని