కెనడా హోటల్‌లో గాంధీ మంచు విగ్రహం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కెనడా హోటల్‌లో గాంధీ మంచు విగ్రహం

టొరంటో: జాతిపిత మహాత్మగాంధీ అహింసా సిద్ధాంతానికి యావత్‌ ప్రపంచం ప్రభావితమైంది. అందుకే అనేక దేశాల్లో ఆయన విగ్రహాలు కనిపిస్తుంటాయి. తాజాగా కెనడాలోనూ ఓ హోటల్‌లో మంచుతో తయారు చేసిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15న జరిగే భారత 75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని క్యూబెక్‌ నగరంలో ఉన్న హోటల్‌ డి గ్లేస్‌ ప్రాంగణంలో హోటల్‌ యాజమాన్యం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఏడు అడుగుల ఎత్తున్న ఈ మంచు విగ్రహాన్ని ప్రముఖ శిల్పి మార్క్‌ లెపిర్‌ తయారు చేశాడు. ఈ విగ్రహం ఏర్పాటు విషయాన్ని టొరంటోలోని భారత రాయబార కార్యాలయం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. విగ్రహం ఫొటో పోస్టు చేస్తూ ‘అజాదికాఅమృత్‌మహోత్సవ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చింది. తొమ్మిది మంచు ఇటుకలను ఉపయోగించి లెపిర్‌ ఐదుగంటల్లోనే విగ్రహాన్ని తయారు చేశాడట. గాంధీ విగ్రహం తయారు చేయడం తనకెంతో సంతోషానిచ్చిందని లెపిర్‌ పేర్కొన్నాడు.


మరిన్ని