అగ్రరాజ్యంలో కరోనా మృత్యుకేళి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అగ్రరాజ్యంలో కరోనా మృత్యుకేళి

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా మృత్యుకేళి కొనసాగుతోంది. క్యాపిటల్‌ ఉదంతంతో అట్టుడుకుతున్న అగ్రరాజ్యాన్ని కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మరో 4,300 మందికి పైగా మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 3,80,000లకు చేరింది. మరోవైపు, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 22.8 మిలియన్లకి చేరుకుంది. అరిజోనా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఈ వైరస్‌ ప్రభావం దారుణంగా కనిపిస్తోంది. రెండున్నర నెలల నుంచి అక్కడ కొవిడ్‌ మరణాల సంఖ్య మరింతగా పెరుగుతోంది.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతున్నప్పటికీ రోజుకు సగటున 2.5లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఇప్పటివరకు 9.3లక్షల మంది అమెరికన్లు వ్యాక్సిన్‌ తొలి డోసును అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్‌ ప్రక్రియను విస్తరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియాలు, ఇతర ప్రదేశాల్లో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలోని అనేకచోట్ల ఆరోగ్య కార్యకర్తలు, నర్సింగ్‌ హోంలలో ఉండేవాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇదీ చదవండి..

హతవిధి.. ట్రంప్‌ పరిస్థితి..!


మరిన్ని