ట్రంప్‌కు ‘సోషల్‌’ షాక్‌!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ట్రంప్‌కు ‘సోషల్‌’ షాక్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రముఖ సామాజిక మాధ్యమాలు షాక్‌ ఇచ్చాయి. క్యాపిటల్‌ భవనంపై దాడులు చేసిన మూకలను గొప్ప దేశభక్తులుగా పేర్కొనడంతో ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ సహా పలు సంస్థలు ఆయన ఖాతాలను తాత్కాలికంగా స్తంభింపజేశాయి. ట్రంప్‌ ఖాతాను 12 గంటల పాటు లాక్‌ చేస్తున్నట్టు ట్విటర్‌ బుధవారం రాత్రి ప్రకటించింది. అలాగే, అగ్రరాజ్యాధినేత చేసిన మూడు ట్వీట్లను తొలిసారి తొలగించింది. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ కూడా అదేరకంగా వ్యవహరించాయి. ఆయన చేసిన పలు పోస్ట్‌లను తొలగించాయి. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ సంస్థలు ట్రంప్‌ తన పేజీలను యాక్సిస్‌ చేసుకొనే అవకాశం లేకుండా 24గంటల పాటు బ్లాక్‌ చేస్తున్నట్టు ప్రకటించాయి. స్నాప్‌చాట్‌ కూడా ట్రంప్‌ ఖాతాను నిరవధికంగా బ్లాక్‌ చేస్తున్నట్టు వెల్లడించింది.  

అమెరికాలో క్యాపిటల్‌ భవనంపై దాడికి పాల్పడిన మూకలను గొప్ప దేశ భక్తులుగా పేర్కొంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేయడం, అలాగే, ఆ నిరసనకారులను ప్రేమిస్తున్నానంటూ వీడియో విడుదల చేయడం పెద్ద దుమారం రేపింది. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ ఉభయ సభలు సమావేశం కాగా.. వేలాది మంది ట్రంప్‌ మద్దతుదారులు రణరంగం సృష్టించిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

క్యాపిటల్‌ భవనంలో ఆ 4 గంటలు..

సారీ ప్రెసిడెంట్‌.. అలా చేయలేకపోయా...

 ‘క్యాపిటల్‌’కు నిలువెల్లా గాయాలే..


మరిన్ని