ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నా: ట్రంప్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నా: ట్రంప్‌

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘‘వాల్టర్‌ రీడ్‌ వైద్య కేంద్రం నుంచి ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు డిశ్చార్జి అవుతున్నాను. కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కొవిడ్‌ గురించి ఎవరూ భయపడొద్దు. మీ జీవితంలో వైరస్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించకుండా చూసుకోండి. ట్రంప్‌ పరిపాలనలో మనం చాలా అభివృద్ధి చెందాం. కరోనా నియంత్రణకు అవసరమైన సమాచారం, ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. 20 ఏళ్ల కిత్రం కంటే కూడా ఇప్పుడు నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను’’ అని ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ట్రంప్‌ దంపతులు ఈనెల 1న కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో వారు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. అనంతరం కరోనా లక్షణాలు ఎక్కువ కావడంతో ట్రంప్‌ ఈ నెల 2న వాషింగ్టన్‌లోని వాల్టర్‌ రీడ్‌ మిలిటరీ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు నిరంతరం చికిత్స అందిస్తున్నారు. 


మరిన్ని