ఇంగ్లాండ్‌లో కరోనాతో  భారతీయ వైద్యుడి మృతి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఇంగ్లాండ్‌లో కరోనాతో  భారతీయ వైద్యుడి మృతి

లండన్‌: ఇంగ్లాండ్‌లో ప్రముఖ భారతీయ డాక్టర్‌ జితేంద్ర కుమార్‌ రాథోడ్‌ సోమవారం తెల్లవారుజామున కరోనా వైరస్‌తో మృతిచెందారు. ఈ విషయాన్ని కార్డిఫ్‌ అండ్‌ వేల్స్‌ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 1977లో బాంబే విశ్వవిద్యాలయం నుంచి వైద్య పట్టా అందుకున్న జితేంద్ర కుమార్‌ తర్వాత ఇంగ్లాండ్‌లో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. నేషనల్‌ హెల్త్‌ సర్వీస్ ‌(ఎన్‌ఎహెచ్‌ఎస్‌)లో ఏళ్లపాటు పనిచేసిన ఆయన 1990 మధ్య కాలం నుంచే కార్డియాలజీ విభాగంలో నిపుణులుగా పేరుతెచ్చుకున్నారు. ఇక 2006 నుంచి యూనివర్శిటీ హాస్పిటల్‌ ఆఫ్‌ వేల్స్‌లో కార్డియాలజీ విభాగంలోనే అసోసియేట్‌ స్పెషలిస్టుగా సేవలందిస్తున్నారు. ఎన్‌హెచ్‌ఎస్‌లో ఇంగ్లాండ్‌ వైద్యుల తర్వాత అత్యధిక మంది పనిచేసేది భారతీయ వైద్యులే. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో ఎంతో మంది భారతీయులు వైద్యులుగా పనిచేస్తున్నారు.

కరోనా వైరస్‌ బారినపడిన జితేంద్ర సోమవారం ఐసీయూలో చికిత్స పొందుతూ మృతిచెందారని వేల్స్‌ యూనివర్శిటీ బోర్డు పేర్కొంది. ‘జితేంద్ర ఎంతో నిబద్ధతగల వైద్యుడు. నిరంతరం పేషంట్ల కోసమే పరితపించారు. ప్రతీ ఒక్కరూ ఆయనను ఇష్టపడతారు, ఎంతో గౌరవిస్తారు. చాలా అద్భుతమైన వ్యక్తి. కార్డియాలజీ విభాగాంలో ఆయన పాత్ర ఆదర్శప్రాయం. జితేంద్ర మృతికి ఎంతో చింతిస్తున్నాం’ అని యూనివర్శిటీ బోర్డు సంతాపం తెలిపింది. మరోవైపు ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. సోమవారం నాటికి అక్కడ మృతుల సంఖ్య ఐదు వేలకు చేరింది


మరిన్ని