ఆ దేశాల తప్పులే భారత్‌కు పాఠాలు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆ దేశాల తప్పులే భారత్‌కు పాఠాలు

యూకేలో స్థిరపడిన వైద్యులు నిమ్మగడ్డ శేషగిరిరావుతో ఇంటర్వ్యూ

కరోనా (కొవిడ్‌-19)పై యుద్ధానికి భారత్‌ ముందున్న సమయాన్ని ఇక్కడి ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు యూకేలో స్థిరపడిన భారతీయ వైద్యులు శేషగిరిరావు. గతనెలలో కరోనా బారిన పడిన ఆయన.. వెంటనే తన సతీమణికి సైతం వైరస్‌ సోకినట్లు గుర్తించారు. స్వీయ చికిత్సతో గృహ నిర్బంధంలో ఉంటూనే కొవిడ్‌ నుంచి బయటపడ్డారు. ఆ అనుభవాలతో పాటు కరోనా విషయంలో యూకే, యూఎస్‌ఏ చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. వైరస్‌ నివారణకు భారత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. లండన్‌ సమీపంలోని న్యూబరీ టౌన్‌లోని ఓ ప్రముఖ మానసిక వైద్యశాల డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ నిమ్మగడ్డ శేషగిరిరావుతో ముఖాముఖి..  
కరోనా వైరస్‌ నుంచి బయట పడేందుకు మీరెలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
కరోనాతో నా కుటుంబం (భార్య, ఇద్దరు పిల్లలు) మూడు వారాల పాటు చాలా ఇబ్బందులు పడింది. నా తర్వాత నా భార్యకు ఈ వైరస్‌ లక్షణాలు కనిపించాయి. ఓ ఆమె పిల్లల్ని పాఠశాల నుంచి తీసుకురావడానికి వెళ్లి తీవ్ర ఒళ్లు నొప్పులతో బాధపడింది. మూడో రోజు వరకు దగ్గు పెరిగి, ఆకలి తగ్గిపోయింది. కరోనాగా నిర్ధరించుకొని ఇంటిని రెండు భాగాలుగా విభజించి పిల్లల్ని ఓ వైపు.. మేం ఓ వైపు ఉన్నాం. వైరస్‌ బారిన పడటంతో ఇద్దరిలోనూ బరువు తగ్గిపోయింది. తీవ్ర జ్వరం, శరీరమంతా నొప్పులుగా ఉండేది. కానీ తగు జాగ్రత్తలతో ఎలాంటి అపాయం లేకుండా బయటపడగలిగాం. చాలా కుటుంబాల్లో ఈ వైరస్‌ పెద్దలకే సోకింది. పిల్లలు కరోనా బారిన పడింది తక్కువే. 
యూకేలో అనుభవం నుంచి భారత్‌కు ఏం చెప్పదల్చుకున్నారు..?
చైనాలో కరోనా విజృంభిస్తున్న సమయంలోనే యూకే, యూఎస్‌ఏలో చర్యలు చేపట్టాల్సింది. భారత్‌లో కాస్తా ముందుగానే చర్యలు చేపట్టారు. యూకేతో పోల్చితే విధానపరంగా సరైన దారిలో దేశం వెళ్తోంది. కనీస సామాజిక దూరం కూడా పాటించకపోవడం..  మొదటి నెల రోజుల నిర్లక్ష్యం యూకేలో వ్యాధి ప్రబలడానికి మరింత కారణమైంది. అందుకే ఇక్కడ ఇన్ని మరణాలు సంభవించాయి.
మరిన్ని వివరాలు కింది వీడియోలో..


Tags :

మరిన్ని