హెచ్‌1బీ వీసాల పరిమితి పొడిగించాలి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
హెచ్‌1బీ వీసాల పరిమితి పొడిగించాలి

అగ్రరాజ్యానికి భారత్‌ విజ్ఞప్తి

న్యూదిల్లీ: అమెరికాలో ఉపాధి పొందుతున్న భారతీయుల హెచ్‌1బీ, ఇతర వీసాల గడువు పరిమితిని పొడిగించాలని అమెరికాకు భారత్‌  విజ్ఞప్తి చేసింది. కరోనా కల్లోలం నేపథ్యంలో హెచ్‌1బీ వీసాదారుల విధులను నిలిపివేయాలని అక్కడి ప్రభుత్వం ఆయా యాజమాన్యాలను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా ప్రభుత్వం అలాంటి ఆదేశాలేవి జారీ చేయలేదని మన దేశానికి చెందిన ఓ ఉన్నతాధికారి మీడియాకు స్పష్టం చేశారు. విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా ఈ విషయమై అక్కడి ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. సదరు ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.

మూడు లక్షల మంది భారతీయులు..
ప్రస్తుతం మన దేశానికి చెందిన దాదాపు మూడు లక్షలకు పైగా  హెచ్‌1బీ వీసాదారులు  అమెరికాలో  ఉపాధి పొందుతున్నారు. ఒకవేళ యూఎస్‌లో ఉన్న హెచ్‌1బీ ఉద్యోగితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సంబంధిత సంస్థ రద్దు చేసుకుంటే సదరు వ్యక్తి 60 రోజుల్లోనే మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో హెచ్‌1బీ వీసా రద్దవుతుంది.


మరిన్ని