కువైట్‌కు భారత వైద్య బృందం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కువైట్‌కు భారత వైద్య బృందం

కరోనా కట్టడికి ఇరుదేశాల పరస్పర సహకారం

న్యూదిల్లీ: కరోనాను సమర్థంగా ఎదుర్కొనేలా కువైట్‌ దేశానికి సహకారం అందించేందుకు భారత్‌ ముందుకు వచ్చింది. అక్కడి ప్రభుత్వం అభ్యర్థన మేరకు 15 మంది వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కూడిన బృందం శనివారం కువైట్‌కు చేరుకుంది. మహమ్మారి నియంత్రణలో భాగంగా వీరు రెండు వారాలు పాటు అక్కడే ఉండి.. స్థానికులకు కరోనాపై అవగాహన, కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల నిర్వహణ, చికిత్స అందించనున్నారు. కరోనాపై సమష్టిగా పోరాడదామని ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, సబా అల్‌-ఖాలీద్‌ అల్‌-సబా ఇదివరకే చర్చించారు. మరోవైపు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి డా.ఎస్‌.జైశంకర్‌ సైతం కువైట్‌లోని తాజా పరిస్థితులపై అక్కడి అధికారులతో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో పరస్పరం మరింత సహకరించుకునే అంశాలపై చర్చించారు.
ఏళ్లుగా మంచి సంబంధాలు..
కువైట్‌తో భారత్‌కు ఏళ్లుగా చారిత్రక, వాణిజ్య, సాంస్కృతిక తదితర రంగాల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. దాదాపు 10 లక్షలకు పైగా ప్రవాస భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కట్టడిలో కువైట్‌ చర్యలకు భారత్‌ తోడ్పాటునందిస్తోంది.


మరిన్ని