అవయవాలు దెబ్బతింటున్నాయి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అవయవాలు దెబ్బతింటున్నాయి

వైరస్‌ లక్షణాలు ఆలస్యంగా బయటపడడమే కారణం
‘ఈనాడు’తో డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘బ్రిటన్‌లో కరోనా వైరస్‌ బాధితులను గుర్తించడం సాధ్యం కావడంలేదు. ఇప్పటి వరకు కేవలం 30 శాతం మందిని మాత్రమే ఇక్కడి ప్రభుత్వం గుర్తించగలిగింది. ఆస్పత్రులకు వస్తున్న బాధితుల తాకిడితో మాకు ఊపిరి సలపని పరిస్థితి. ప్రభుత్వం చేసిన గొప్ప పని ఏమిటంటే యుద్ధప్రాతిపదికన అన్ని స్థాయుల వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. వార్డు బాయ్‌ నుంచి సీనియర్‌ కన్సల్టెంట్‌ వరకు అందరికీ అత్యవసర సేవల్లో అనుసరించాల్సిన విధానాలపై ఇచ్చిన శిక్షణ ప్రస్తుతం ఎంతో ఉపయోగపడుతోంది. కరోనా బాధితులను కాపాడుతోంది. అందువల్లే ఈ మాత్రమైనా చికిత్స చేయగలుగుతున్నాం’’ అని బ్రిటన్‌లోని నార్త్‌ హెర్ట్‌ఫోర్‌ఫైర్‌లోని లిస్టర్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ టి.శ్రవణ్‌కుమార్‌ చెప్పారు. ఆయన ‘ఈనాడు’తో ఫోన్‌లో మాట్లాడారు.

లక్షణాలు కనిపించటం లేదు
బ్రిటన్‌లో కేసులు నమోదైన తొలివారం రోజుల్లో వైరస్‌ లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా మారిపోయింది. వైరస్‌ లక్షణాలు ఆలస్యంగా బయటపడుతున్నాయి. అందుకే ఎక్కువమందికి అవయవాలు దెబ్బతింటున్నాయి. వెంటనే చనిపోతున్నారు. నేను పనిచేస్తున్న ఆస్పత్రిలో ఉన్న 730 పడకల్లో కరోనాతో బాధితులే. బాధితుల్లో 90% మందికి ఆక్సిజన్‌ అవసరం అవుతోంది. కొందరికి వెంటిలేటర్‌ ద్వారా ఇవ్వాల్సి వస్తోంది. మరికొందరికి ముక్కు ద్వారా అందజేసినపుడు సిబ్బందికి వైరస్‌ వ్యాపిస్తోంది. దీంతో గొంతులోకి ట్యూబ్‌వేసి ఆక్సిజన్‌ఇవ్వాల్సి వస్తోంది.

Tags :

మరిన్ని