అమెరికాలో 24 గంటల్లో 1514 మరణాలు 
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాలో 24 గంటల్లో 1514 మరణాలు 

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ విజృంభణతో వణికిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో 24 గంటల్లో 1514 మంది మృత్యువాతపడ్డారు. శనివారంతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడం ఊరట కలిగించే అంశం. నిన్న 1920 మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో 22,020 మంది ప్రాణాల్ని ఈ మహమ్మారి బలిగొంది. వీటిలో 9,385 మరణాలు ఒక్క న్యూయార్క్‌లో సంభవించినవే.  ప్రపంచంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. వైరస్ సోకిన వారి సంఖ్యలోనూ అమెరికాదే మొదటి స్థానం. ఆదివారం నాటికి అక్కడ 5,59,409 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. గతంలో వివిధ పద్ధతుల ద్వారా అంచనా వేసిన ప్రకారం యూఎస్‌లో వైరస్‌ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకునేందుకు దగ్గరగా ఉందని ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్’‌(ఎఫ్‌డీఏ) కమిషనర్‌ స్టీఫెన్‌ హాన్‌ తెలిపారు.    

వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌ రాష్ట్రంలో ఆదివారం 758 మంది మరణించినట్లు గవర్నర్‌ ఆండ్రూ క్యుమో తెలిపారు. రోజువారీ కేసుల సంఖ్య తగ్గనప్పటికీ.. వ్యాప్తి రేటు మాత్రం తగ్గిందని వెల్లడించారు. అలాగే ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు వైరస్‌ వల్ల తీవ్రంగా ప్రభావితమైన న్యూజెర్సీ, కనెక్టీకట్‌ రాష్ట్రాలతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి...

లాక్‌ చేస్తేనే.. వ్యాప్తి డౌన్‌!
ఆ మూడూ ప్రధాన ఆయుధాలు


మరిన్ని