మీ వాళ్లని తీసుకెళ్లండి.. లేదంటే: యూఏఈ
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మీ వాళ్లని తీసుకెళ్లండి.. లేదంటే: యూఏఈ

దుబాయ్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో తమ దేశంలో ఉన్న విదేశీ కార్మికుల్ని తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపని వారి సొంత దేశాలపై కఠిన ఆంక్షలు విధిస్తామని యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్వదేశీయులకు ముప్పు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అక్కడి ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఆయా దేశాలకు ‘కోటా’ విధించి వ్యక్తుల్ని ఎంపిక చేయాల్సి వస్తుందని హెచ్చరింది. కార్మికులను అనుమతించే విషయంలో ఇప్పటికే ఆయా దేశాలతో కుదిరిన ‘అవగాహనా ఒప్పందాల్ని’(ఎంఓయూ) రద్దు చేసుకునేందుకూ వెనుకాడబోమని తేల్చి చెప్పింది. 

ఇప్పటికే పలుమార్లు ఆయా దేశాలకు లేఖలు పంపామని.. అయినా ఎలాంటి స్పందన లేదని దీనితో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. అందుకే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు. సొంత దేశాలకు వెళ్లాలనుకుంటున్న వారిని తీసుకెళ్లే బాధ్యత ఆయా దేశాలపైనే ఉందని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా వారి బాధ్యతను నిర్వర్తించాలని హితవు పలికారు. అయితే, అవి ఏయే దేశాలు అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. యూఏఈలో ఉన్న విదేశీయుల్లో భారతీయ సమాజానిదే సింహభాగం. దాదాపు 33 లక్షల మంది ఉన్నట్లు సమాచారం. ఇది ఆ దేశ జనాభాలో 30శాతం. 

దీనిపై భారత్‌లోని యూఏఈ రాయబారి అహ్మద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ అల్‌ బన్నా స్పందించారు. భారత్‌ సహా తమ దేశంలోని అన్ని రాయబార కార్యాలయాలకు ఈ సమాచారాన్ని అందజేశామని తెలిపారు. వివిధ కారణాల వల్ల అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. సొంత దేశానికి వెళ్లాలనుకుంటున్న వారిని పంపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే, కరోనా పాజిటివ్‌గా తేలినవారికి మాత్రం అక్కడే చికిత్స అందజేస్తామని స్పష్టం చేశారు. 

ఇవీ చదవండి...

చైనాలో మళ్లీ పెరుగుతున్న కేసులు!

అదో తప్పుడు వార్త: ట్రంప్‌

Tags :

మరిన్ని