పొగ తాగడం మానాల్సిందే
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
పొగ తాగడం మానాల్సిందే

అమెరికాలో ప్రముఖ హృద్రోగ వైద్యులు వర్ధన్‌రెడ్డి వెల్లడి

కొవిడ్‌-19 సోకిన వ్యక్తులలో 15 శాతం మందికి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని.. వీరు వైరస్‌ నుంచి కోలుకున్నాక కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అమెరికాలోని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ వర్ధన్‌రెడ్డి సూచిస్తున్నారు. పిట్స్‌బర్గ్‌లో కరోనాపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా ఉన్న ఆయన అక్కడి నుంచి ‘ఈటీవీ భారత్‌’తో మాట్లాడారు. అన్ని దేశాల్లో 2-3 నెలల్లో 70% వరకూ పరిస్థితి అదుపులోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. గుండె వ్యాధిగ్రస్థులపై కరోనా ప్రభావం నిరూపితమైంది. మధుమేహం, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్లకూ రిస్క్‌ ఎక్కువే. ఈ వైరస్‌ ప్రధానంగా ఊపిరితిత్తులు, రక్తనాళాలకు మధ్య ఉన్న వాల్వ్‌ను దెబ్బతీస్తుంది. అందుకే పొగ తాగే వారు.. మానేయకుంటే ప్రాణాంతకం అవుతుంది.

* మొదట్లో చైనా నుంచి సమాచారం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. దాంతో అమెరికాలో పూర్తిగా సన్నద్ధం కాలేకపోయాం. న్యూయార్క్‌ వంటి నగరాల్లో అధిక జనసాంద్రత కారణంగా వైరస్‌ తొందరగా వ్యాప్తి చెంది మరణాలు ఎక్కువయ్యాయి. ఇక్కడి ప్రజల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమూ ఒక అంశం.
* భారతీయులు రకరకాల వ్యాధికారక సమస్యలతో పోరాడతారు కాబట్టి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. టీబీ నిరోధక బీసీజీ వ్యాక్సినేషన్‌ రోగ నిరోధక శక్తిని పెంచటంలో కొంతవరకూ పనిచేసింది. భారత్‌ సహా మలేరియా ప్రభావిత దేశాల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడటం కారణంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి అక్కడి వారిలో ఉండి ఉండవచ్చు.

Tags :

మరిన్ని