అమెరికాలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాలో 7 లక్షలు దాటిన కరోనా కేసులు

ఇతర దేశాలతో పోలిస్తే ప్రమాదకరంగా మారుతున్న వైనం

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాపై కరోనా వైరస్‌ పగబట్టింది. తాజాగా అక్కడ కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. ఊహించని విధంగా అమెరికాలో కొవిడ్‌ 19 వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా నమోదుకానన్ని కేసులు, అత్యధిక మరణాలతో సతమతమవుతున్న అమెరికా.. ఇకపై పెను సవాలును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం అర్థరాత్రి వరకు అక్కడ నమోదైన కేసుల సంఖ్య 7,06,309కి చేరింది. మృతుల సంఖ్య 36,607గా నమోదైంది. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 58,478కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 3,856 మంది మృతిచెందారు. ఇందులో కరోనా అనుమానిత మరణాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక అత్యధిక మరణాల్లో రెండో స్థానంలో ఉన్న ఇటలీలో వైరస్‌ సోకినవారి సంఖ్య 1,72,434కి పెరిగింది. మృతుల సంఖ్య 22,745గా నిర్ధరణ అయ్యింది. ఈ దేశంలో గత 24 గంటల్లో 575 మంది మృతిచెందారు. స్పెయిన్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,90,859కి చేరింది. మృతుల సంఖ్య 20,002గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 687 మంది మరణించారు. మరోవైపు ఫ్రాన్స్‌లో మొత్తం కేసుల సంఖ్య 1,09,252 కాగా, మృతులు 18,681. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 761 మంది మరణించారు. 

ఇవి చదవండి: 

‘వైరస్‌ హాట్‌స్పాట్‌’కు వెళ్లిన ఇవాంక

చైనా మరణాలు ఇంకా ఎక్కువే ఉంటాయి:ట్రంప్‌

Tags :

మరిన్ని