చైనా మరణాలు ఇంకా ఎక్కువే ఉంటాయి:ట్రంప్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చైనా మరణాలు ఇంకా ఎక్కువే ఉంటాయి:ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ విషయంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి నిప్పులు చెరిగారు. మరణాల సంఖ్య చైనా ప్రభుత్వం చెబుతున్న దానికంటే చాలా ఎక్కువే ఉంటుందని ఆరోపించారు. వుహాన్‌లో కొవిడ్‌-19 మరణాల సంఖ్యను సవరిస్తూ శుక్రవారం చైనా అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ నగరంలో సంభవించిన మరణాలకు దాదాపు 50 శాతం అంటే 1,290 మరణాలను అదనంగా చేర్చారు. దీంతో డ్రాగన్‌ దేశంలో సంభవించిన మరణాల సంఖ్య ఒకేసారి 40శాతం పెరిగి 4,632కు పెరిగింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ మరోసారి చైనాపై విరుచుకుపడ్డట్లు తెలుస్తోంది. 

‘‘కొవిడ్‌-19 మరణాల సంఖ్యను చైనా ఒక్కసారిగా రెట్టింపు చేసింది. మృతుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది. అమెరికా కంటే కూడా ఎక్కువే ఉంటుంది. మరణాల విషయంలో యూఎస్‌ వారి దరిదాపుల్లోకి కూడా వెళ్లదు’’
  -డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

కరోనా వైరస్‌ విషయంలో అప్రమత్తం చేయడంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించిందని ట్రంప్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సైతం చైనాకు మద్దతుగా నిలిచిందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సంస్థకు ఇవ్వాల్సిన నిధుల్ని కూడా నిలిపివేశారు. ఆయన పాలకవర్గం ఏకంగా కరోనా విషయంలో చైనా, డబ్ల్యూహెచ్‌ఓ పనితీరుపై విచారణ జరిపేందుకు కూడా సిద్ధమయ్యింది.

 

ఇవీ చదవండి..

చైనాపై అనుమానం నిజమేనా?

గుప్తంగా వ్యాప్తి!

Tags :

మరిన్ని