ఆఫ్-క్యాంపస్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆఫ్-క్యాంపస్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి!

క్యాంపస్ ప్రాంగణంలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి!

వాషింగ్టన్‌: అమెరికాలో చిక్కుకుపోయిన విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం తాజాగా వెసులుబాటు కలిగించింది. కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడ్డ సంక్షోభంతో ఆర్థికంగా ఇబ్బందిపడే విదేశీ విద్యార్థులు ఇక ఆఫ్‌-క్యాంపస్‌ ఉద్యోగం చేసుకునే వీలును కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా ఇబ్బందిపడే విద్యార్థులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో భారత్‌తోపాటు విదేశాలకు చెందిన వేలమంది విద్యార్థులకు ఉపశమనం కలిగినట్లు అయ్యింది.

ఊహించని విధంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా అమెరికాలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో విశ్వవిద్యాలయాలు మూతపడడంతో ప్రజలందరూ వారి నివాసాలకే పరిమితయ్యారు. ఈ సమయంలో విద్యార్థులకు లభించే ఆర్థిక ప్రోత్సాహకాలు ఆగిపోవడం, అంతర్జాతీయ కరెన్సీ మారకపు విలువలు పడిపోవడం, ట్యూషన్‌ ఫీజులు, నివాస ఖర్చులు పెరిగిపోవడం వంటి కారణాల వల్ల విద్యార్థులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదర్కొంటున్నారు. ఇలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే విదేశీ విద్యార్థులు క్యాంపస్‌లో పనిచేయడానికి వీలు కల్పిస్తున్నట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(USCIS) ప్రకటించింది. ఇలాంటివారు అధికారిక ధృవీకరణకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రతి దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించిన తరువాత నిబంధనలకు లోబడిన వారికి అనుమతి లభిస్తుంది.

అమెరికాలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తగ్గించేందుకు ఉపశమన చర్యలను గతనెల ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాదాపు చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడటంతో చాలా మంది విద్యార్థులు తమ హాస్టళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో వీరికి నివాస ఖర్చు భారమయ్యింది. దీంతో కొందరు తమ సొంత దేశాలకు వెళ్లిపోగా.. అంతర్జాతీయ విమానయానంపై ఆంక్షలతో మరికొందరు అక్కడే చిక్కుకుపోయారు. వీరిలో కొందరిని అక్కడే స్థిరపడినవారు ఆదుకోగా చాలామంది విద్యార్థులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో క్యాంపస్‌ పరిధిలో ఉద్యోగం చేసుకునేందుకు వీటుంటుంది. ఒకవేళ మీ అభ్యర్థనను USCIS అనుమతించినట్లయితే ఒక సంవత్సరం పాటు క్యాంపస్‌ ప్రాంగణంలో ఉద్యోగం చేసుకోవడానికి వీలుంటుంది.

Tags :

మరిన్ని