కరోనాపై పోరులో భారత అమెరికన్‌ డాక్టర్లు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కరోనాపై పోరులో భారత అమెరికన్‌ డాక్టర్లు

విపత్కర పరిస్థితుల్లో విశేష కృషి 
వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పలువురు

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇప్పటికే ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అతలాకుతలమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ దేశంలోనే 7.5లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 40 వేల మందికిపైగా మృతిచెందారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడ వైద్య సేవలందిస్తున్న డాక్టర్ల పాత్ర అభినందనీయం. వారి ధైర్యానికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. అయితే, వైరస్‌ బాధితులకు చికిత్సనందిస్తూనే ఎంతో మంది వైద్యులు సైతం కరోనా బాధితులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారిలో భారతీయ అమెరికన్‌ డాక్టర్లూ చాలా మంది ఉన్నారు. 

భర్త, కూతురితో మెసేజ్‌లు చేస్తూనే..
భారత్‌కు చెందిన డాక్టర్‌ మాధ్వి అయా 1994లో తన భర్తతో కలిసి అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడి న్యూయార్క్‌లో వైద్యురాలిగా కొనసాగుతున్నారు. మార్చిలో ఓ కరోనా పేషంట్‌కు చికిత్స అందిస్తూ ఆమె కూడా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనాకు చికిత్స పొందుతున్న సమయంలో మాధ్వి తన భర్త, కుమార్తెలతో ఫోన్‌లో టెక్ట్స్‌ మెసేజ్‌లు చేస్తుండేవారు. వారిద్దరూ ఆమె కడసారి చూపునకు కూడా నోచుకోలేదు. మాధ్వి తన భర్త, కుమార్తెతో చాట్‌ చేసిన మెసేజ్‌లు పరిశీలిస్తే ఆమె జీవితమంతా వైద్య వృత్తికే అంకితమైందనే విషయం తెలుస్తోంది. 

అక్కడే ఎక్కువ భారతీయ వైద్యులు..

అమెరికాలో కరోనాతో సతమతమవుతున్న వైద్యుల్లో భారత అమెరికన్‌ డాక్టర్లు అధిక సంఖ్యలో ఉన్నారని అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌(ఏఏపీఐ) సెక్రటరీ రవి కొల్లి చెప్పారు. ఇక్కడ భారతీయ ఫిజిషియన్లు వేల మంది ఉన్నారని, పదుల సంఖ్యలో వైద్యులు కరోనాతో బాధపడుతున్నారని తెలిపారు. కచ్చితంగా ఎంత మంది వైరస్‌ బారిన పడ్డారో చెప్పడం కష్టమని ఆయన పేర్కొన్నారు. న్యూయార్క్‌, న్యూజెర్సీలోనే ఎక్కువ మంది భారతీయ వైద్యులున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పది మంది వైద్యుల పరిస్థితి విషమంగా ఉందన్నారు. గతవారం ప్రియా ఖన్నా(43) అనే ఇండియన్‌ అమెరికన్‌ నెఫ్రాలజిస్ట్‌ కరోనాతో మృతిచెందారని, ఆమె తండ్రి అయిన జనరల్‌ సర్జన్‌ సత్యేంద్ర ఖన్నా(78) కూడా కరోనాతో పోరాడుతూ ఐసీయూలో ఉన్నారని రవి వెల్లడించారు. 

కరోనా పేషంట్‌ వాంతులు చేసుకోవడంతో..
ఇటీవల న్యూజెర్సీలోని ఓ ఆస్పత్రిలో భారతీయ వైద్యుడొకరు ఎమర్జెన్సీ విభాగంలో కరోనా పేషంట్‌కు చికిత్స అందించారు. ఆ సమయంలో పేషంట్‌ వైద్యుడిపైనే వాంతులు చేసుకోవడంతో ఆయనకు వైరస్‌ సోకింది. అదే ఆస్పత్రిలో చేరిన వైద్యుడిని రక్షించేందుకు సిబ్బంది ఎంత కృషి చేసినా ఫలితం దక్కలేదు. ఆ వైద్యుడు మృతిచెందారు.

కరోనాపై పోరులో భారతీయ అమెరికన్‌ వైద్యులు నిజమైన హీరోలని ఏఏపీఐ ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ జి.అనుపమ  ప్రశంసించారు. ఈ పోరులో కొందరు వైద్యులు మరణించారని, మరికొంత మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇంకొందరు కోలుకొని ఇళ్లల్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఏఏపీఐ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ అజయ్‌ లోధా కూడా వైరస్‌ బారిన పడ్డారని, ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు. అలాగే ఒహైయోలో నివసిస్తున్న ఏఏపీఐ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ గౌతమ్‌ సమద్దర్‌ సతీమణి డాక్టర్‌ అంజనా సమద్దర్‌ కూడా వైరస్‌బారిన పడ్డారని చెప్పారు. మరో ప్రముఖ భారతీయ అమెరికన్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ సునీల్‌ మెహ్రా సీరియస్‌ కండీషన్‌లో ఉన్నారని అనుపమ చెప్పారు.

ఇవీ చదవండి..

భారత్‌లో 543 మరణాలు.. 17 వేల కేసులు

అగ్రరాజ్యానికి కాసింత ఊరట


Tags :

మరిన్ని