అమెరికాలోని తెలుగు ప్రజల పెద్దమనసు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమెరికాలోని తెలుగు ప్రజల పెద్దమనసు

కరోనా వేళ విస్తృత సేవా కార్యక్రమాలు

 

మిన్నెసోట: కరోనాతో అమెరికా అతలాకుతలం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అక్కడున్న తెలుగువారు సేవా కార్యక్రమాలు చేపడుతూ.. తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మిన్నెసోట అధ్యక్షుడు తోడుపునూరి రాము, ఉపాధ్యక్షుడు పేరకం రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆకుల రమేశ్‌, కోశాధికారి పేటేటి రామ్‌, ఐఏఎం అధ్యక్షుడు చేక శ్రీనివాస్‌, ఫిట్‌ ఎన్‌ ఫ్యాబ్‌ ప్రతినిధి నాదెళ్ల పద్మ, సేవా సంస్థ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ యాట దశరథ్‌ తదితరులు స్థానికంగా మాస్కుల తయారీ, ఆహార పంపిణీ కార్యకలాపాల్లో సహకారం అందిస్తున్నారు. శారద అమ్మాణి జయంతి అనే ప్రవాస మహిళ రోజూ 100 మందికి అవసరమైన ఆహారాన్ని తయారు చేసి ఆసియా, భారతీయ విద్యార్థులు, వయోధికులు, గర్భిణీలకు అందజేస్తున్నారు. లఘువరం మోనా, గంగేయుల అనూష, గంటి శ్రీలత, పాత్స శ్రీవిద్య, రాధిక ఉపద్రష్ట, కరుణ కాజాలాంటి 60 మందికిపైగా మహిళా వాలంటీర్లు మాస్కులు కుడుతూ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలలో పంపిణీ చేస్తున్నారు.


మరిన్ని