వేల్స్‌లో తెలుగు విద్యార్థులకు సాయం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
వేల్స్‌లో తెలుగు విద్యార్థులకు సాయం

కార్డిఫ్‌‌: కరోనా మహమ్మారి విసిరిన పంజాకు యావత్‌ ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి.  ఈ వైరస్‌తో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో యూకేలోని వేల్స్‌ రాజధాని కార్డిఫ్‌లో అనేకమంది తెలుగు విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని ఆదుకోవడమే లక్ష్యంగా కొందరు తెలుగు యువకులు ముందుకొచ్చి ‘వేల్స్‌ 19 కొవిడ్‌ సపోర్టు గ్రూప్‌’ ఏర్పాటు చేశారు. విరాళాలు సేకరిస్తూ ఆ మొత్తంతో నిత్యావసర సరకుల్ని కొనుగోలు చేసి  తెలుగు విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆంక్షలు ఉన్నా.. తమ ఉద్యోగాల్లో సైతం ఇబ్బందులు ఉన్నా అన్నింటినీ అధిగమించి సహృదయంతో విద్యార్థులను ఆదుకొనేందుకు కొంత సమయం కేటాయిస్తూ మానవతా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. ఓ కచ్చితమైన ప్రణాళికతో ఈ వారంతంలో 40కి పైగా నివాసాలకు వెళ్లిన వాలంటీర్లు.. 200 మంది తెలుగు విద్యార్థులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.


మరిన్ని