కరోనాపై పోరు సాగిస్తున్న వైద్యులకు వందనం
కరోనాపై పోరు సాగిస్తున్న వైద్యులకు వందనం

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రబలుతున్న కరోనా మహమ్మారిపై గత కొన్ని రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్న ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ల సేవలను స్థానికులు కొనియాడారు. కరోనా వైరస్‌ అమెరికాలో వేగంగా విజృంభిస్తున్నా.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మేరీల్యాండ్ రాష్ట్రంలో విలువైన సేవలు అందిస్తున్న వైద్యుల గౌరవార్థం స్థానికులు తమ కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సందేశంతో కూడిన ఫ్లకార్డులతో, చప్పట్లతో వైద్యుల సేవలను కొనియాడారు. కరోనాతో పోరాడే హీరోలుగా వైద్యులను అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు కూడా పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తామని చెప్పారు.

 

 మరిన్ని