పీఎం- కేర్స్‌కు సమైక్య తెలుగు వేదిక విరాళం
పీఎం- కేర్స్‌కు సమైక్య తెలుగు వేదిక విరాళం

బెర్లిన్‌: కరోనా వైరస్‌పై పోరుకు ఏర్పాటైన పీఎం- కేర్స్‌కు ప్రవాస భారతీయులు తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా జర్మనీలోని స్టూట్గర్ట్‌ పరిధిలో ఉన్న తెలుగు సంఘం ‘సమైక్య తెలుగు వేదిక’ (ఎస్‌టీవీ) సభ్యులు పీఎం-కేర్స్‌కు విరాళం అందించారు. మొత్తం 1,111 యూరోలు (భారతీయ కరెన్సీ ప్రకారం రరూ.90వేలు) విరాళంగా అందించినట్లు ఆ సంఘం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి దేశానికి సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ విరాళం అందించామని, భవిష్యత్‌లోనూ మాతృభూమికి తమ సహకారం ఉంటుందని తెలిపింది.


మరిన్ని