అమెరికాలో చదివిన వారికి హెచ్‌-1బీ లో తొలి ప్రాధాన్యం
అమెరికాలో చదివిన వారికి హెచ్‌-1బీ లో తొలి ప్రాధాన్యం

వాషింగ్టన్‌: అమెరికాలో చదువుకున్న విదేశీ యువతలో ప్రతిభావంతులకు హెచ్‌-1బీ ఉద్యోగ వీసాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదిస్తూ అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లో సభ్యులు బిల్లు ప్రవేశపెట్టారు. పలు సంస్కరణలతో కూడిన ఈ బిల్లు ఆమోదం పొందితే ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. ది హెచ్‌-1బీ అండ్‌ ఎల్‌-1 వీసా రిఫార్మ్‌ యాక్ట్‌’ పేరుతో రూపొందించిన తాజా బిల్లును ప్రతినిధుల సభ, సెనేట్‌లో సభ్యులు ప్రవేశపెట్టారు. ఉన్నత విద్య, నైపుణ్యం కలిగి అమెరికాలో చదువుకున్న చురుకైన విద్యార్థులకు హెచ్‌-1బీ వీసా జారీలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అందులో ప్రతిపాదించారు. మరోవైపు, అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగానికి  ఈ ఏడాది ఏప్రిల్‌-1 నాటికి 2,75,000 హెచ్‌-1బీ దరఖాస్తులు అందాయి.

Tags :

మరిన్ని