10వేల కుటుంబాలకు ఎన్‌ఆర్‌ఐ తెదేపా సాయం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
10వేల కుటుంబాలకు ఎన్‌ఆర్‌ఐ తెదేపా సాయం

జన్మభూమి రుణం తీర్చుకున్న ప్రవాసాంధ్రులు

అమరావతి: నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా తెదేపా ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన  దాదాపు పదివేల నిరుపేద బ్రాహ్మణ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ, బిసి కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేశారు. రాజమహేంద్రవరంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, విజయవాడలో గద్దె రామ్మోహన్, బోండా ఉమా మహేశ్వరరావు, విజయనగరంలో అశోక్‌గజపతిరాజు, నందిగామలో తంగిరాల సౌమ్య, తణుకులో ఆరుమిల్లి రాధాకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, పెదకాకానిలో ధూళిపాళ్ల నరేంద్ర, అమరావతి, గుంటూరులో కోవెలమూడి నాని, ఉప్పుటూరి సీతామహాలక్ష్మీ, దొడ్డపనేని రాజేంద్ర, శ్రీకాకుళంలో పైలా ప్రసాద్ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసరాలు అందజేశారు. 


మరిన్ని