సింగపూర్‌లో ఘనంగా అన్నమయ్య శతగళార్చాన
సింగపూర్‌లో ఘనంగా అన్నమయ్య శతగళార్చాన

సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ఆధ్వర్యంలో అన్నమయ్య శతగళార్చన ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 5 దేశాల నుంచి 17మంది ప్రదర్శన ఇవ్వగా, 200 మందికి పైగా లైవ్ వీక్షించారు.  సింగపూర్‌లోని తెలుగు వారి  ప్రోత్సాహం, అపూర్వ స్పందన వల్ల లభించిన స్ఫూర్తితో మూడో సమ్మేళనాన్ని నిర్వహించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈసారి సమ్మేళనము ఆన్‌లైన్‌లో నిర్వహించారు. అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, భారత్‌, దుబాయ్, జర్మనీ, సింగపూర్ తదితర దేశాల నుంచి తెలుగు వారందరు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. 

కార్యక్రమంలో భాగంగా 100మందికి పైగా పిల్లలు పంపిన అన్నమయ్య కీర్తనల నుంచి, 16 కీర్తనలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వయొలినిస్ట్, స్వరకర్త డా. జ్యోత్స్నా శ్రీకాంత్ తమదైన శైలిలో ‘బ్రహ్మమొక్కటే’ కీర్తనను వయోలిన్‌పై ప్రదర్శించి అందరినీ అలరించారు. ఈ కీర్తనలను, విన్నూత్న రీతిలో రోజుకు ఒక కీర్తన చొప్పున యూట్యూబ్‌ ద్వారా విడుదల చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.  ఊలపల్లి సాంబశివ రావు, వాణి ప్రభాకరి, డా.జ్యోత్స్నాశ్రీకాంత్‌, కవుటూరు రత్నకుమార్,  తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులైన చుక్కల ఉమాదేవి, చివుకుల లావణ్య, రాధాకృష్ణ గణేశ్న, చివుకుల సురేష్, భాగవతుల రవితేజ తదితరుల సహకారంతో  ఈ కార్యక్రమం సంకలనం చేశామని  అంతర్జాతీయశాఖ అధ్యక్షులు ఊలపల్లి
భాస్కర్, విద్యాధరిలు ప్రకటించారు.

Tags :

మరిన్ని