భారత్‌ వచ్చేందుకు సాయం చేయండి
భారత్‌ వచ్చేందుకు సాయం చేయండి

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇదే క్రమంలో నెదర్లాండ్స్‌ చిక్కుకున్న 140 మంది తెలుగువారు వారి స్వస్థలాలకు వచ్చేందుకు సాయం చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే నెదర్లాండ్స్‌ తెలుగు సంఘం (ఎన్‌ఎల్‌టీసీ) దీనికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసినట్టుగా పేర్కొంది. చదువు, ఉద్యోగం నిమిత్తం ఇక్కడకు వచ్చి స్థిరపడినవారు, కుటుంబ సభ్యులను చూసేందుకు వచ్చినవారిలో ఉన్న వృద్ధులు ఇలా అనేకమంది ఇక్కడ తీవ్ర మానసిక ఆవేదనకు గురవుతున్నారని లేఖలో వివరించింది. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేక నిత్యావసర సరుకులు కొనుక్కునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ఇప్పటికే ఇలాంటి వారిని తరలించేందుకు నెదర్లాండ్స్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రయత్నాలు చేస్తునప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపితే సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని ఆ లేఖలో విన్నవించింది.


మరిన్ని