అమెరికాలో బాలయ్య జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు   
అమెరికాలో బాలయ్య జన్మదిన వేడుకలకు ఏర్పాట్లు    

వాషింగ్టన్‌ డీసీ : ప్రముఖ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రవాస భారతీయుడు కోమటి జయరాం పేర్కొన్నారు. జూన్ 10న బాలకృష్ణ 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు, అమెరికాలోనూ తమ అభిమాన హీరో పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. బాలకృష్ణ 50వ పుట్టిన రోజు వేడుకలను కూడా ప్రవాస భారతీయుడు కోమటి జయరాం అమెరికా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సారి కూడా ఆయన సారథ్యంలోనే బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు అమెరికావ్యాప్తంగా ఘనంగా జరగబోతున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే మరపురాని జ్ఞాపకంలా నిలిచిపోయేలా ఈ వేడుకలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. బాలయ్య అభిమానులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోమటి జయరాం పిలుపునిచ్చారు. 


మరిన్ని