అభిమానులతో బాలయ్య వీడియో కాన్ఫరెన్స్‌
అభిమానులతో బాలయ్య వీడియో కాన్ఫరెన్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: తన జన్మదినం సందర్భంగా సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమెరికాలోని అభిమానులతో టీవీ ఆసియా, తెలుగు మయూరి, జూమ్ యాప్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మన్నవ మోహనకృష్ణ, రవి పొట్లూరి నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎప్పుడు అమెరికా వచ్చినా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారని, వారి అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ‘గౌతమి పుత్ర శతకర్ణి’ విడుదల సమయంలో అమెరికా వచ్చినప్పుడు తనపై చూపించిన అభిమానాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. తన జన్మదినం సందర్భంగా అమెరికాలో అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. కరోనా వైరస్‌ తీవ్రత ఉన్నా బాలకృష్ణ  పుట్టిన రోజు సందర్భంగా అమెరికాలోని పలు నగరాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా వైరస్‌పై పోరాడుతున్న ప్రభుత్వ శాఖల సిబ్బందికి నిత్యావసరాలు, మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అమెరికాలో నివసిస్తున్న నటీమణులు లయ, అంకిత, గాయనీ గాయకులు కౌసల్య, సింహా, పృథ్వి, యాంకర్‌ రవి, ఇమిటేషన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

మరిన్ని