అంతర్జాతీయ పితృదినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
అంతర్జాతీయ పితృదినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు


​​​​​​

ఇంటర్నెట్‌ డెస్క్‌: 'అంతర్జాతీయ పితృదినోత్సవం' సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జూన్‌ 21న దృశ్య మాధ్యమ సమావేశంలో ‘నాన్న నీకు నమస్కారం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సారధి డా. ప్రసాద్ తోటకూర ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, రచయిత, నటుడు తనికెళ్ల భరణి అతిథులుగా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వేడుకలు జూన్‌ 21న భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు మొదలవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా ‘ఘనుడు నాన్న, త్యాగధనుడు నాన్న’ అనే అంశంపై కవితల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలు పాల్గొనాలని సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ కోరారు. కార్యక్రమాలను తానా ఫేస్‌బుక్‌ పేజీ, యూట్యూబ్‌ ఛానల్‌, ‘మన టీవీ’లో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు. మరింత సమాచారం కోసం www.tana.org సందర్శించాల్సిందిగా ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమానికి వెన్నం ఫౌండేషన్, బైట్ గ్రాఫ్స్ తోడ్పాటు అందించనుంది.

Tags :

మరిన్ని