యూకేలో ఘనంగా పీవీ శత జయంతి ఉత్సవాలు
యూకేలో ఘనంగా పీవీ శత జయంతి ఉత్సవాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను విదేశాల్లో కూడా ప్రవాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. యూకేలోని బర్మింగ్‌హామ్‌లో పీవీకి ప్రవాసులు ఘన నివాళి అర్పించారు. కేంద్ర ప్రభుత్వం  పీవీకి భారత రత్న ప్రకటించాలని ఈ సందర్భంగా  వారు కోరారు. పీవీ శత జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని వారు ప్రశంసించారు. ఆర్థిక సంస్కరణల కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. పీవీ గొప్ప విజ్ఞాని, రాజనీతిజ్ఞుడు,, సంస్కరణల విషయంలో దూరదృష్టి కలవాడు అని ఇంగ్లాండ్‌కు చెందిన పలువురు వైద్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డా.రవీంద్ర కాటమనేని, డా.శ్రీనివాస్‌ దాసరి, డా.గోపాలకృష్ణ పెమ్మరాజు, డా.చేతన్‌ పార్చ, డా.కిషోర్‌ దాసరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డా. రవీంద్ర, డా. శేషేంద్ర నిర్వహించారు.


మరిన్ని