అమరావతి రైతుల పోరాటానికి ఎన్నారైల సంఘీభావం
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
అమరావతి రైతుల పోరాటానికి ఎన్నారైల సంఘీభావం

జూలై 3న 200 నగరాల్లో కొవ్వొత్తులతో నిరసన

అమరావతి: ప్రపంచ చరిత్రలో వివాద రహితంగా  భూసేకరణ జరిగిన ఏకైక ప్రాజెక్టు అమరావతి అని ప్రముఖ ఎన్నారై జయరాం కోమటి అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం  ‘‘మంచి రాజధాని కట్టుకుందాం- ఇతరులు అసూయపడేలా అంతర్జాతీయ ప్రమాణాలతో గొప్ప నగరాన్ని నిర్మించుకుందాం’’ అని అమరావతి ప్రాంతాన్ని గత ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. కానీ, ప్రభుత్వం మారిన వెంటనే రైతుల త్యాగం నిష్ఫలంగా మారిందని.. అప్పటివరకు వేగంగా సాగుతున్న అమరావతి పనులు ఆగిపోయాయని  ఆవేదన వ్యక్తంచేశారు. మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు నిరసనకు దిగి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. వారి పోరాటం 200 రోజులకు చేరుకున్న సందర్భంగా అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా అమెరికా సహా పలు దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. జూలై 3న ప్రపంచ దేశాల్లోని 200 నగరాల్లో కొవ్వొత్తులతో నిరసనలు చేపట్టి అమరావతి రైతులకు సంఘీభావం తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఆయా నగరాల్లోని ప్రవాసాంధ్రులు స్థానికంగా అమలులో ఉన్న నిబంధనలు పాటిస్తూనే ఒక్కోచోట 15-20 మందికి మించకుండా ఈ నిరసనలో పాల్గొనాలని జయరాం కోమటి విజ్ఞప్తి చేశారు.

అమెరికా, ఇతర దేశాల్లో 100 మంది ఆయా నగరాల్లో సమన్వయకర్తలుగా వీరితో టచ్‌లో ఉంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా తమ మద్దతు తెలుపుతూ పేర్లను నామినేట్ చేస్తున్నారు. కార్యక్రమం విజయవంతానికి అన్నిరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని’ అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారంతా కచ్చితంగా నల్లటి మాస్క్ ధరించాలని నిర్వహకులు కోరారు. కొవిడ్ వల్ల ఇతరులతో కలవడానికి ఇబ్బంది పడే వారు కూడా నల్లటి మాస్క్‌ ధరించి తమ ఇంట్లోనే నిరసన తెలిపి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని నిర్వహకులు కోరారు. #NRIsForAmaravati #SaveAmaravati హ్యాష్ ట్యాగ్‌లను ప్రతి ఒక్కరూ వాడాలని నిర్వహకులు విజ్ఞప్తి చేశారు.

కొవ్వొత్తులతో నిరసనలు ఈ నగరాల్లోనే..


మరిన్ని