సింగపూర్‌లో ‘జూమ్‌’ సామూహిక సత్యనారాయణ వ్రతం
సింగపూర్‌లో ‘జూమ్‌’ సామూహిక సత్యనారాయణ వ్రతం

పాల్గొన్న వందలాది భక్తులు

సింగపూర్‌: శ్రావణ మాసం, నాగ పంచమిని పురస్కరించుకొని సింగపూర్‌లోని వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో జూమ్‌ ద్వారా  సామూహిక  సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 60 కుటుంబాలు పాల్గొన్నాయి. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వాసవి సిస్టర్స్‌ పామిడి నాగమణి మనోహర్, గరికపాటి జయలక్ష్మిలు పాల్గొన్నారు. అన్నమాచార్య కీర్తనలు, సత్యనారాయణస్వామి పాటలు ఆలపించారు. ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లా చిలంకూర్‌ నుంచి కావ్యశర్మ జూమ్‌ ద్వారా  అందరినీ సమన్వయం చేస్తూ వ్రతం చేయించారు.

ఈ సందర్భంగా వాసవి క్లబ్‌ అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌ గొట్లూరు మాట్లాడుతూ.. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ సింగపూర్‌లో నివసిస్తున్న ఆర్యవైశ్యులందరూ పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని సమన్వం చేసిన క్లబ్‌ ప్రధాన కార్యదర్శి నారంశెట్టి నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ.. సింగపూర్‌లోని ఆర్యవైశ్యులందరూ వాసవిమాత చెప్పిన ధర్మ సూక్ష్మాలు, దాన ధర్మాలు పాటిస్తూ ముందుకెళ్లాలని కోరారు. కరోనా పరిస్థితుల్లోనూ వాసవి క్లబ్, సింగపూర్‌ ప్రతినిధులు ప్రతి శనివారం వినూత్న కార్యక్రమం చేపడుతున్నారంటూ చార్టర్‌ అధ్యక్షుడు కైలా నాగరాజు తెలిపారు. కోర్‌కమిటీ సభ్యులు ముకేశ్‌ భూపతి, రాజశేఖర్‌ గుప్తా, ముక్కా కిశోర్, పబ్బతి మురళి తదితరులను అరుణ్‌కుమార్‌  అభినందించారు.

 

Tags :

మరిన్ని