టీకా సంస్థలతో భేటీ కానున్న బైడెన్‌ సలహాదారులు
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
టీకా సంస్థలతో భేటీ కానున్న బైడెన్‌ సలహాదారులు

వాషింగ్టన్‌: అమెరికాలో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ బృందంలోని శాస్త్రీయ సలహాదారులు రానున్న రోజుల్లో టీకా తయారీదారులతో చర్చలు జరుపుతారు. ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించడానికి నిరాకరిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరితో అధికార బదలాయింపుపై అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రజారోగ్య సంక్షోభమున్న తరుణంలో.. కొత్త ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించడంలో జాప్యం జరిగితే ఇబ్బందులు తలెత్తుతాయని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌’ అధిపతి ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నివారణకు టీకా తయారీదారులతో ఇప్పటి నుంచే కసరత్తు చేయడం మంచిదని తెలిపారు. వ్యాక్సిన్‌ తయారీలో ముందంజలో ఉన్న ఫైజర్‌, ఇతర ఔషధ కంపెనీలతో చర్చలు జరుపుతామని బైడెన్‌ బృందం సభ్యుడు రాన్‌ క్లెయిన్‌ చెప్పారు.

Tags :

మరిన్ని