బ్రిటిష్‌ ఇండియన్‌ రచయిత్రికి హెజెల్‌ టిల్ట్‌మన్‌ బహుమతి
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బ్రిటిష్‌ ఇండియన్‌ రచయిత్రికి హెజెల్‌ టిల్ట్‌మన్‌ బహుమతి

 జలియన్‌వాలా బాగ్‌ చారిత్రక ఘటనపై పుస్తకాన్ని రచించిన అనితా ఆనంద్‌

లండన్‌: బ్రిటిష్‌ ఇండియన్‌ రచయిత్రి అనితా అనంద్‌ను ప్రతిష్ఠాత్మక ‘హెజెల్‌ టిల్ట్‌మన్‌ బహుమతి’ వరించింది. భారత్‌లో జరిగిన జలియన్‌వాలా బాగ్‌ ఘటనపై రచించిన పుస్తకం గొప్ప చారిత్రక రచనగా ఎంపికవడంతో ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఆమె రచించిన ‘ది పేషెంట్‌ అసాసిన్‌: ఎ ట్రూ టేల్‌ ఆఫ్‌ మాసకర్‌’ను వాస్తవిక చారిత్రక నేపథ్యం ఉన్న పుస్తకంగా ఆవార్డు కమిటీ న్యాయనిర్ణేతలు అభివర్ణించారు. ఈ బహుమతి దక్కడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బహుమతి రూపంలో ఆమెకు 2 వేల పౌండ్లు(సుమారు రూ.2 లక్షలు) దక్కనున్నాయి. ‘‘ఈ పుస్తకం.. అమృత్‌సర్‌లో 1919లో  జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన దారుణ మారణహోమానికి సంబంధించి.. ఓ హంతకుడికి, ఓ బాధితుడికి మధ్య జరిగిన కథ. దానికి బాధ్యుడైన ఓ బ్రిటిష్‌ అధికారిపై.. ఆ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత ఆ బాధితుడు పగ తీర్చుకున్న కథ. అంతకు మించి ఇద్దరు వ్యక్తుల కథ’’ అని న్యాయనిర్ణేతల్లో ఒకరైన రాణా మిట్టర్‌ తెలిపారు.

Tags :

మరిన్ని