గరిమెళ్ల పాట...తెల్లదొరల గుండెల్లో తూటా!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
గరిమెళ్ల పాట...తెల్లదొరల గుండెల్లో తూటా!

మన నేల బిడ్డ

నేడు సత్యనారాయణ వర్ధంతి

 న్యూస్‌టుడే, పోలాకి

‘మా కొద్దీ తెల్ల దొరతనం’ అంటూ తన గేయంతో తెల్లదొరల గుండెల్లో తూటా పేల్చిన గరిమెళ్ల సత్యనారాయణ సిక్కోలు వాసి. ఈయన 1893 జులై 15న పోలాకి మండలంలోని ప్రియాగ్రహారంలో జన్మించారు. ప్రాథమిక విద్య ఇక్కడే పూర్తి చేసి ఉన్నత చదువులకు విశాఖపట్నం, రాజమహేంద్రవరం వెళ్లారు. డిగ్రీ పూర్తి చేసుకొని ఒడిశాలో గుమస్తాగా పని చేసి అనంతరం విజయనగరంలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. గాంధీ పిలుపునకు స్పందించి ఉద్యోగానికి స్వస్తి పలికి స్వాతంత్య్ర ఉద్యమంలోకి అడుగుపెట్టారు. తన గేయాలతో, పాటలతో పోరాటానికి ఊపిరిలూదారు. బ్రిటీష్‌ గుండెల్లో గుబులు రేపి జైలు పాలయ్యారు. మద్రాసులోని పలు పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు. రచనలు కొనసాగించారు. చివరకు తీవ్ర అనారోగ్యానికి గురై 1952 డిసెంబరు 18న తుది శ్వాస విడిచారు. సిక్కోలు వాసులు ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తుంటారు.

Tags :

మరిన్ని