బైడెన్‌ బృందంలోకి మరో ఇద్దరు..
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
బైడెన్‌ బృందంలోకి మరో ఇద్దరు..

వాషింగ్టన్‌: ప్రజాసేవల విభాగంలో నిపుణులైన ఇద్దరు భారతీయ-అమెరికన్లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా కీలక పదవుల్లో నియమించారు. స్వచ్ఛంద సేవకు సంబంధించిన ఫెడరల్‌ ఏజెన్సీ ‘అమెరికార్ప్స్‌’కు జాతీయ వ్యవహారాల డైరెక్టర్‌గా సోనాలీ నిజ్వాన్‌ నియమితులయ్యారు. మరో భారతీయ అమెరికన్‌ శ్రీ ప్రిస్టన్‌ కులకర్ణి.. విదేశీ వ్యవహారాల సారథిగా ఎంపికయ్యారు. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికన్‌ కాంగ్రెస్‌కు టెక్సాస్‌ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓటమి చవిచూసినప్పటికీ కులకర్ణికి ఈ గుర్తింపు దక్కడం విశేషం.

Tags :

మరిన్ని