కాడా.. నిమ్మకాయ.. విటమిన్‌ మాత్రలు 
close
కాడా.. నిమ్మకాయ.. విటమిన్‌ మాత్రలు  

 దిల్లీ సరిహద్దుల్లో రైతుల ‘కరోనా’ జాగ్రత్తలు

దిల్లీ: కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కరోనా సోకకుండా జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ‘‘సింఘు సరిహద్దులో ఇప్పటివరకు పెద్దగా కరోనా వైరస్‌ కేసులు లేవు. రైతులు ‘కాడా’ (మూలికలు, వివిధ మసాలాలతో తయారు చేసిన రసం), నిమ్మకాయ నీళ్లు, విటమిన్‌ మాత్రలు వాడుతున్నారు. ఆందోళన పడాల్సిన అవసరమే లేదు’’ అని సుఖ్వీందర్‌ అనే రైతు తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారంతో తాము కరోనాను జయిస్తున్నామని చెప్పారు. తాము ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో టీకా కేంద్రాలు తెరవాలని కొందరు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ‘‘టిక్రి సరిహద్దు దగ్గర వ్యాక్సినేషన్‌ కేంద్రం పెట్టాలని డిమాండ్‌ చేశాం. ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు’’ అని ఓ రైతు చెప్పారు. మరోవైపు కొవిడ్‌ మహమ్మారి పోరులో రైతులూ భాగస్వాములు అవుతున్నారు. ఆక్సిజన్‌ లంగర్లు ప్రారంభించామని, ఇందులోంచి కొవిడ్‌ రోగులకు సిలిండర్లు అందిస్తున్నామని రైతు నాయకుడు ధర్మేంద్ర మాలిక్‌ తెలిపారు


 


మరిన్ని