USA: ఏటా 20 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం
USA: ఏటా 20 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం

అమెరికాలో మౌలిక వసతులకు మహర్దశ

రూ.75 లక్షల కోట్ల ప్రణాళికకు సెనేట్‌ ఆమోదం 

వాషింగ్టన్‌: అమెరికాలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చే దిశగా కీలక ముందడుగు పడింది. దాదాపు రూ.75 లక్షల కోట్ల (1 ట్రిలియన్‌ డాలర్లు) విలువైన జాతీయ మౌలిక వసతుల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు సెనేట్‌ ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. దేశాధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. రిపబ్లికన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో దాని అమలుపై కొన్నాళ్లుగా అనిశ్చితి నెలకొంది. నిధుల వ్యయానికి సంబంధించి కొన్ని నిబంధనలను సవరించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో.. 67-32 ఓట్ల తేడాతో దానికి తాత్కాలిక ఆమోద ముద్ర లభించింది. సెనేట్‌లో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల బలం 50-50గా ఉంది. తాజా ప్రణాళికకు తుది ఆమోదం లభించేందుకు కనీసం 60 మంది సభ్యుల మద్దతు అవసరం. తుది ఆమోదం విషయంలో రిపబ్లికన్లు ఎంతమేరకు సహకరిస్తారన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. 1 ట్రిలియన్‌ డాలర్ల విలువైన ఈ ప్రణాళిక అమలైతే.. అమెరికాలో దశాబ్ద కాలం పాటు ఏటా 20 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశాలున్నాయి. 

Tags :

మరిన్ని