వేడుకగా కాన్సస్ నగర తెలుగు సంఘం రజతోత్సవం
వేడుకగా కాన్సస్ నగర తెలుగు సంఘం రజతోత్సవం

కాన్సస్‌: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ కాన్సస్‌ సిటీ (టీఏజీకేసీ)ని స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఓలాతే బాల్ కాన్ఫరెన్స్ హాల్లో రజతోత్సవ సంబరాలు ఆగస్టు 28న నిర్వహించారు. దాదాపు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వంశీ సువ్వారి, శ్రావణి మేక వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. దుర్గా తెల్ల, అంజనీ దేవి, సరిత రాయన, మంజుల సువ్వారి, శిరీష టేకులపల్లి, లక్ష్మీ నాయుడు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ శ్రీకాంత్‌ రావికంటి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా గణేషుడిని స్తుతిస్తూ చిన్నారని చరణి రంగిని పాడిన గీతం అందరినీ అలరించింది. 

రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వారు తమ తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా 25 ఏళ్లుగా సంఘానికి సేవలందించిన అధ్యక్షులు, ట్రస్ట్‌ బోర్డు ఛైర్‌పర్సన్లు, వారి జీవిత భాగస్వాములను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ అధ్యక్షులు తమ తమ అనుభవాలను పంచుకున్నారు. శ్రీనివాస్‌ కోటిపల్లి చెప్పిన అనుభవాలు ఆకట్టుకున్నాయి. అలాగే, 35 ఏళ్లుగా స్థానిక తెలుగు వారికి, సంఘానికి సేవలందిస్తున్న లక్ష్మీ నాయుడును జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా స్థానిక గాయకులు విశ్వమోహన్‌ అమ్ముల, నిధి రావు పాటలతో అలరించారు. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ టేకులపల్లి తన ఉపన్యాసంలో సంఘం చేసిన సాహితీ, సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అందరూ కలసి ఒక కుటుంబంలా చక్కని భోజనం చేయడంతో కార్యక్రమం ముగిసింది.

Advertisement

Tags :

మరిన్ని