శ్రీనివాస్‌ వడ్లమానికి ఘన సత్కారం
శ్రీనివాస్‌ వడ్లమానికి ఘన సత్కారం

చార్లెట్, నార్త్ కెరోలినా, అమెరికాకు చెందిన మానవతావాది, గాయకులు శ్రీనివాస్ వడ్లమానిని వంశీ ఆర్ట్ థియేటర్స్ సంస్థ ఘనంగా సత్కరించింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్, టెక్సాస్ వారు 95వ ప్రచురణగా ముద్రించిన ‘లిటిల్ డిటెక్టివ్’ నవలిక ముద్రణకు శ్రీనివాస్ వడ్లమాని, లక్ష్మీ పద్మజ వడ్లమాని సహకరించారు. దీనిపై ‘లిటిల్ డిటెక్టివ్’ నవలా రచయిత్రి, పూర్వ సెన్సార్ బోర్డు మెంబరు డాక్టర్ తెన్నేటి సుధాదేవి హర్షం ప్రకటించారు. ‘లిటిల్ డిటెక్టివ్’ నవలను శ్రీనివాస్‌కు బహుకరించి సత్కరించారు. ఈ సందర్భంగా వంశీ సంస్థల అధినేత డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ.. శ్రీనివాస్ వడ్లమాని మాతృభాషను, మాతృదేశాన్ని మరవకుండా తెలుగు భాషకు చేస్తున్న సేవ ప్రశంసనీయమన్నారు. అనంతరం శ్రీనివాస్‌ వడ్లమాని.. వంశీ వేగేశ్న ఫౌండేషన్ ఆశ్రమాలలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి, షిరిడి సాయిబాబా, ఘంటసాల గుడి, దివ్యాంగుల ఆశ్రమాన్ని సందర్శించారు. వేగేశ్న ఫౌండేషన్ ఛైర్‌ పర్సన్‌, వంశీ కల్చరల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ శైలజ సుంకరపల్లి సేవలను శ్రీనివాస్‌ అభినందించారు. స్వర్ణోత్సవాలలోకి అడుగిడుతున్న వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇస్తున్న ప్రోత్సాహం ప్రశంసనీయమని శ్రీనివాస్ అన్నారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని