మెక్సికోలో డ్రగ్స్‌ ముఠా కాల్పులు.. ప్రవాస భారతీయురాలి మృతి
మెక్సికోలో డ్రగ్స్‌ ముఠా కాల్పులు.. ప్రవాస భారతీయురాలి మృతి

లాస్‌ఏంజెలెస్‌: 30వ పుట్టినరోజు పండుగను ఘనంగా నిర్వహించుకునే ఉద్దేశంతో మెక్సికో వెళ్లిన భారతీయ అమెరికన్‌ అంజలి ర్యోట్‌ అనూహ్య రీతిలో మాదక ద్రవ్యాల ముఠాల కాల్పులకు బలైపోయారు. బుధవారం రాత్రి ఆమె తన భర్త ఉత్కర్ష్‌తో కలిసి ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తున్నప్పుడు సమీపంలో డ్రగ్స్‌ ముఠాలు పరస్పర కాల్పులకు తెగబడ్డాయి. తూటాలు దూసుకురావడంతో అక్కడ ఉన్నవారిలో అంజలితో పాటు జర్మనీ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయారు. గతంలో యాహూలో, ప్రస్తుతం లింక్డ్‌ఇన్‌లో సీనియర్‌ ఇంజినీర్‌గా ఉన్న అంజలి కాలిఫోర్నియా వాసి. ప్రయాణాలను ఇష్టపడే ఆమె బ్లాగర్‌ కూడా. ఆమె తల్లిదండ్రులు హిమాచల్‌ప్రదేశ్‌ వాస్తవ్యులు. 

Advertisement

Tags :

మరిన్ని