మార్చిలో గ్లోబల్‌ హిందూ టీన్స్‌ వర్చువల్‌ కాన్ఫరెన్స్‌
మార్చిలో గ్లోబల్‌ హిందూ టీన్స్‌ వర్చువల్‌ కాన్ఫరెన్స్‌

వీడియో పంపండి.. క్యాష్‌ ప్రైజ్‌ గెలుచుకోండి

లివర్‌మోర్‌: కాలిఫోర్నియాలోని లివర్‌మోర్‌ శివ విష్ణు ఆలయంలోని హిందూ కమ్యూనిటీ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించనుంది. 2021 మార్చిలో గ్లోబల్‌ హిందూ టీన్స్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. యువతలో ఆసక్తితో పాటు జ్ఞానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా వర్చువల్‌ మీట్‌ ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధి మనోహర్‌ మహావాది తెలిపారు. ‘‘20వ శతాబ్దానికి ముందు అభివృద్ధి, శాంతి, సంపదకు హిందూ సమాజం చేసిన కృషి, మానవాళి అభివృద్ధి కోసం అందించిన సేవలు’’ అంశంపై ఆరు నిమిషాల నిడివి కలిగిన వీడియోను రూపొందించాలని సూచించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు 13 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలని పరిమితి విధించింది.  ఆసక్తి కలిగినవారు 2021 జనవరి 15 నుంచి తమ వీడియోలను సమర్పించాలలని మనోహర్‌ పేర్కొన్నారు. దీనికి ఆఖరి గడువు ఫిబ్రవరి 15గా నిర్ణయించినట్టు ప్రకటనలో తెలిపారు. తమకు వచ్చిన వీడియోలను నిపుణుల బృందం పరిశీలిస్తుందని, విజేతలకు ప్రత్యేక గుర్తింపుతో పాటు నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం www.livermoretemple.orgలో చూడవచ్చు.  ఎవరికైనా సందేహాలు ఉంటే youthconf@livermoretemple.orgకి మెయిల్‌ చేయాలని ఆయన కోరారు.


Tags :

మరిన్ని