భారత్‌-యూఏఈల బంధం నిరంతరం..
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
భారత్‌-యూఏఈల బంధం నిరంతరం..

అబుధాబీ యువరాజుతో మోదీ చర్చలు

దిల్లీ: కొవిడ్‌ అనంతరం భారత్‌ - యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ల మధ్య పరస్పర సహకారం, సన్నిహిత సంప్రదింపులు కొనసాగనున్నాయి. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుధాబీ తాత్కాలిక పాలకుడు, యూఏఈ యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌లు ఓ ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు యువరాజు మహమ్మద్‌ బిన్‌ జయేద్‌తో సాదర చర్చలు జరిగినట్లు ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

యూఏఈ యువరాజుతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) గురువారం వెల్లడించింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో కొవిడ్‌ ప్రభావంపై చర్చించిన నేతలిద్దరూ.. ఆరోగ్య సంక్షోభ సమయంలోనూ ఉభయ దేశాల మధ్య సహకారం కొనసాగడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వాణిజ్యాభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించి అవకాశాలపై చర్చించారు. కొవిడ్‌ సంక్షోభం త్వరలోనే సమసిపోతుందన్న విశ్వాసాన్ని నేతలిద్దరూ వెల్లడించారు.

ఇదీ చదవండి..

అమెరికాలో భారతీయ వైద్యుడి దమనకాండ


మరిన్ని