సిన్సినాటి మేయర్‌ రేసులో ఇండియన్‌ అమెరికన్‌
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
సిన్సినాటి మేయర్‌ రేసులో ఇండియన్‌ అమెరికన్‌

వాషింగ్టన్‌: అమెరికా, ఒహైయో రాష్ట్రంలోని ముఖ్య నగరమైన సిన్సినాటి మేయర్‌ పదవికి భారత సంతతి వ్యక్తి పోటీపడుతున్నారు. ఈ మేరకు చేసిన ఓ ప్రకటనలో ఇండియన్‌ - అమెరికన్‌ న్యాయవాది, డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన ఆఫ్తాబ్‌ పురేవల్‌ (38) తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. హామిల్టన్‌ కౌంటీ కోర్టుల క్లర్కు అయిన ఆఫ్తాబ్‌, ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన అభీష్టాన్ని ట్వీట్‌ ద్వారా వెల్లడించారు. ఈయన తల్లిదండ్రులు 1980లో భారత్‌ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఆఫ్తాబ్‌ 2018లో కాంగ్రెస్‌ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యేందుకు పయత్నించి విఫలమయ్యారు.

ఇదీ చదవండి..

భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులుమరిన్ని