యూఎస్‌పై భారత సంతతి ఆధిపత్యం: బైడెన్
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
యూఎస్‌పై భారత సంతతి ఆధిపత్యం: బైడెన్

వాషింగ్టన్: అమెరికాలో భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం రోజురోజుకూ పెరుగుతోందని ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. దేశ పాలనలో కీలక పదవులను అధిరోహించి..తమ దేశంపై వారు పట్టు పెంచుకుంటున్నారని ప్రశంసించారు. అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) శాస్త్రవేత్తలతో వర్చువల్ విధానంలో మాట్లాడుతూ..ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘అమెరికాలో భారత సంతతి విస్తరిస్తోంది. వారు ఈ దేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మీరు(స్వాతిమోహన్‌), ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, నా ప్రసంగ ప్రతి రాసిన వినయ్ రెడ్డి అంతా భారతీయ అమెరికన్లే’ అని బైడెన్ అన్నారు. నాసా మార్స్ మిషన్ 2020(గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ ఆపరేషన్స్‌)కు నాయకత్వం వహిస్తోన్న స్వాతి మోహన్ గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.

కాగా, జనవరి 20న బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ పదవి చేపట్టిన 50 రోజుల్లో..ఆయన యంత్రాంగంలో 55 మంది భారతీయ అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. ఇంతమంది భారత సంతతి వ్యక్తులు ప్రజాసేవలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉండటాన్ని చూడటం ఆకట్టుకుంటోందని ఆయన అన్నారు. అయితే బడ్జెట్ చీఫ్‌గా భారతీయ మూలాలున్న నీరా టాండన్ నియామకంపై మాత్రం ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది.


మరిన్ని